News August 15, 2024

ఈసారి ప్రధాని తలపాగా ప్రత్యేకత ఏంటంటే..

image

2014 నుంచి ప్రతీ పంద్రాగస్టు వేడుకలకు PM మోదీ ఒక్కో సంస్కృతి విశిష్టతను సూచించేలా తలపాగాను ధరిస్తూ వస్తున్నారు. ఈరోజు కాషాయం, పసుపు, పచ్చ వర్ణాలు కలిగిన రాజస్థానీ లెహెరియా తలపాగాను ధరించారు. రాజస్థాన్ ఎడారుల్లో గాలి కారణంగా ఏర్పడే ఇసుక తిన్నెల ఆకారాల స్ఫూర్తిగా లెహెరియా తలపాగాల డిజైన్ ఉంటుంది. కాగా.. గత ఏడాది పసుపు, పచ్చ, ఎరుపు రంగులతో కూడిన బంధనీ ప్రింట్ తలపాగాతో ప్రధాని కనిపించారు.

Similar News

News November 4, 2025

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News November 4, 2025

DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్‌ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/

News November 4, 2025

చల్లని vs వేడి నీళ్లు.. పొద్దున్నే ఏవి తాగాలి?

image

ఉదయాన్నే ఓ గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘గోరువెచ్చటి నీటికి జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. డిటాక్సిఫికేషన్, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఓ గ్లాసు చల్లటి నీళ్లు తాగితే క్యాలరీలు బర్న్ అవుతాయి. రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది. చల్లటి నీటికి శరీరం వేగంగా హైడ్రేట్ అవుతుంది’ అని చెబుతున్నారు. మీ అవసరాలను బట్టి గోరువెచ్చటి లేదా చల్లటి నీరు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.