News August 15, 2024

యోధులకు వందనం.. మీ సేవలు మరువం

image

కని పెంచిన తల్లిదండ్రుల నుంచే స్వేచ్ఛ లేదని ఈ తరం పిల్లలు రచ్చ చేస్తున్నారు. కానీ వారికి అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం గురించి తెలియాలంటే 1947 AUG 15 కంటే వెనక్కు వెళ్లాలి. వందల ఏళ్లు పరాయివాడి పాలనలో నలిగిపోయి భారతావని కన్నీళ్లుపెట్టింది. తెల్లవారిని తరిమికొట్టి దేశానికి స్వేచ్ఛ కోసం గాంధీ, బోస్, నెహ్రూనే కాదు.. ఎన్నో వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి యోధులకు వందనం.. మీ సేవలు ఎన్నటికీ మరవం.

Similar News

News November 14, 2025

వేంకటేశ్వరస్వామి: మీకు ఈ కథ తెలుసా?

image

తిరుమల సోపాన మార్గంలోని మోకాలి మెట్టు వద్ద రాతి పెట్టెలుంటాయి. అవే పద్మావతి అమ్మవారి 7 వారాల సార్లపెట్టెలని నమ్మకం. వివాహం తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి కొండకు బయలుదేరారు. అప్పుడే స్వామివారికి ఇల్లాలున్న విషయం గుర్తొచ్చింది. దీంతో పద్మావతిని ‘కరివేపాకు తెచ్చావా?’ అని అడిగి, తిరిగి పంపాడు. అలా వెనక్కి వెళ్లి అమ్మవారు తిరుచానూరులో శిలగా మారారు. ఈ పెట్టెలు నగల కోసమేనని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 14, 2025

NMLలో 21 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML)లో 21పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్ ), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://nml.co.in/en/jobs/

News November 14, 2025

భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే

image

బిహార్‌లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం వెల్లడైన ట్రెండ్స్‌లో 180+ సీట్లలో ముందంజలో ఉంది. ఎంజీబీ 59 సీట్లు, జేఎస్పీ 1, ఇతరులు 3 సీట్లలో లీడింగ్‌లో ఉన్నారు. జన్ శక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ 8,800 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మహువా స్థానంలో 1500 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.