News August 15, 2024

వైసీపీ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసింది: సీఎం చంద్రబాబు

image

AP: 2014-19 మధ్య ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయని దుయ్యబట్టారు. విజయవాడలో మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేశారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు’ అని మండిపడ్డారు.

Similar News

News December 28, 2025

శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

image

శీతాకాలంలో ఇమ్యునిటీ తగ్గడం వల్ల రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం, ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగడం మంచిది. రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవాలి. క్యారెట్, బంగాళాదుంప, చిలకడదుంప , పాలకూర, మెంతి కూర, నారింజ, దానిమ్మ, యాపిల్, తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, బాదం, వాల్‌నట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.

News December 28, 2025

ఇల్లాలి నోటి నుంచి రాకూడని మాటలివే..

image

ఇల్లాలిని ‘గృహలక్ష్మి’గా భావిస్తారు. ఆమె మాట్లాడే మాటలు ఇంటి వాతావరణాన్ని, ఐశ్వర్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆమె నోటి నుంచి ఎప్పుడూ పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టం వంటి అమంగళకరమైన పదాలు రాకూడదు. వాటిని పదే పదే ఉచ్చరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తగ్గి, లక్ష్మీదేవి కటాక్షం లోపిస్తుందని చెబుతారు. శుభకర మాటల వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సానుకూల పదాలను వాడటం వల్ల ఆ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది.

News December 28, 2025

O-1, L-1, E-2 వీసాలకు డిమాండ్

image

H-1B వీసా నిబంధనలు కఠినం కావడంతో US కంపెనీలు ఇతర వీసాలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా టాలెంటెడ్ మ్యాన్‌పవర్‌కిచ్చే O-1 వీసాకు డిమాండ్ పెరిగింది. కంపెనీల్లో అంతర్గత బదిలీల కోసం వాడే L-1, ఇన్వెస్టర్లకిచ్చే E-2 వీసాలను ఎంచుకుంటున్నాయి. H-1B లాటరీ గందరగోళం, అదనపు ఫీజుల భారం తప్పుతాయని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. టాలెంట్ ఉన్నవారు ఇకపై ఈ మార్గంలో US వెళ్లే అవకాశం ఉంది.