News August 15, 2024

కరీంనగర్: జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

image

కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్‌లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ అభిషేక్ తదితరులు ఉన్నారు.

Similar News

News July 7, 2025

కరీంనగర్ జిల్లాలో 59 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.

News July 7, 2025

పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

image

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు.

News July 7, 2025

నేడు కరీంనగర్‌లో మంత్రుల పర్యటన

image

కరీంనగర్‌లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనలు పర్యటించనున్నారు.
ఉ.9:30 గం.కు పాత ఆర్ట్స్ కళాశాల వద్ద నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
10 గం.లకు అంబేడ్కర్ స్టేడియంలో వన మహోత్సవంలో పాల్గొంటారు.
11గం.కు చేప పిల్లల పెంపకం పరిశీలించి ముదిరాజ్ సంఘాలతో సమావేశమవుతారు.
11:30గంకు క్రీడా పాఠశాల, ఈతకొలను ప్రారంభించి వివిధ క్రీడా సంఘాలతో సమావేశమవుతారు.