News August 15, 2024

అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం

image

AP: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు. రేపటి నుంచి మరో 99 క్యాంటీన్‌లను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆరంభించనున్నారు. రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి డిన్నర్ అందజేస్తారు.

Similar News

News January 15, 2026

ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో తీర్పు!

image

TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపునకు పాల్పడ్డారన్న MLAలు చింతా ప్రభాకర్, జగదీశ్ రెడ్డి ఫిర్యాదుపై ఇవాళ స్పీకర్ నిర్ణయం వెల్లడించనున్నారు. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీరి అనర్హత పిటిషన్లపై తీర్పునకు మరింత సమయం పట్టనుంది.

News January 15, 2026

జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

image

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్‌, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.

News January 15, 2026

‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.