News August 15, 2024
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్ల దోపిడీ: రేవంత్

TG: కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నీ బోగస్ మాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్తగూడెంలోని పూసుగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు. తాము ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
Similar News
News July 8, 2025
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ఫ్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 83,458 పాయింట్లు లాభపడగా, Nifty ఒక పాయింట్ నష్టంతో 25,459 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, NTPC, ఇండస్ ఇండ్, ICICI, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో, టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News July 8, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ UPDATES

* కాసేపట్లో శ్రీశైలానికి ఏపీ సీఎం చంద్రబాబు, మ.12 గంటలకు డ్యామ్ గేట్ల ఎత్తివేత
* TG: పాశమైలారం సిగాచీ ఘటనలో 44కు చేరిన మరణాలు
* కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మృతిపై పవన్ సంతాపం
* YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన షర్మిల
* వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
* విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నేడు NIAకు బదిలీ
* కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు KTR.. భారీగా మోహరించిన పోలీసులు
News July 8, 2025
12లోగా MPTC స్థానాల తుది జాబితా

TG: MPTCల పునర్విభజనను జులై 12లోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. పలు పంచాయతీలు మున్సిపాలిటీల్లో, కొన్ని పొరుగు పంచాయతీల్లో విలీనమవడం, జిల్లా మారడం వంటివి జరగడంతో డీలిమిటేషన్ చేయనుంది. ప్రతి మండలంలో కనీసం 5 MPTC స్థానాలు ఉండాలని, ఇవాళ ముసాయిదా స్థానాలు ప్రచురించాలని సూచించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించి 12న తుది జాబితాను ప్రకటించాలంది.