News August 15, 2024

కర్ణాటక SBI, PNBలో అకౌంట్లు ఎందుకు క్లోజ్ చేస్తోందంటే..

image

SBI, PNBలో అన్ని ఖాతాలను మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని, ఇకపై లావాదేవీలు చేపట్టొదని ప్రభుత్వ శాఖలు, సంస్థలను ఆదేశించింది. KIADB చేసిన రూ.12 కోట్లు, KSPCBకి చెందిన రూ.10 కోట్ల డిపాజిట్ల అవినీతిలో తమ ఉద్యోగుల పాత్ర ఉందంటూ బ్యాంకులు డబ్బుల్ని వెనక్కి ఇవ్వలేదు. బ్యాంకు అధికారులతో చర్చలూ విఫలమవ్వడంతో విషయం న్యాయ పరిధిలోకి వెళ్లింది.

Similar News

News January 15, 2025

కృష్ణా జలాల్లో మెజారిటీ వాటా TGకే దక్కాలి: మంత్రి ఉత్తమ్

image

కృష్ణా జలాల విషయంలో TGకి అన్యాయం జరగొద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేపు కృష్ణానది జలవివాదంపై విచారణ ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్‌కు నివేదించాల్సిన అంశాలపై ఢిల్లీలో సమీక్షించారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. TGలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికే దక్కాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.

News January 15, 2025

2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సినిమాలు ఇవే

image

ఈ ఏడాది తమ OTTలో వచ్చే కొన్ని సినిమాల పేర్లను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
☞ నాని ‘హిట్-3’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
☞ విజయ్ దేవరకొండ- డైరెక్టర్ గౌతమ్ మూవీ (VD 12)
☞ నాగచైతన్య ‘తండేల్’, సూర్య ‘రెట్రో’
☞ రవితేజ ‘మాస్ జాతర’
☞ మ్యాడ్ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’
☞ సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’
☞ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
☞ పవన్ కళ్యాణ్ ‘OG’

News January 15, 2025

ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం

image

ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.