News August 15, 2024

T20 WC ఆతిథ్యానికి నో చెప్పిన జైషా

image

బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలన్న ICC ప్రతిపాదనను తిరస్కరించానని BCCI కార్యదర్శి జైషా తెలిపారు. ‘భారత్‌లో అక్టోబర్లో వర్షాలు కురుస్తాయి. పైగా వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వాలి. అందుకే వరుసగా 2 మెగా టోర్నీలు నిర్వహించలేమని సంకేతాలు పంపించా’ అని ఆయన అన్నారు. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో క్రికెటర్ల భద్రతపై ICC ఆందోళన చెందుతోంది.

Similar News

News July 8, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ UPDATES

image

* కాసేపట్లో శ్రీశైలానికి ఏపీ సీఎం చంద్రబాబు, మ.12 గంటలకు డ్యామ్ గేట్ల ఎత్తివేత
* TG: పాశమైలారం సిగాచీ ఘటనలో 44కు చేరిన మరణాలు
* కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మృతిపై పవన్ సంతాపం
* YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన షర్మిల
* వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
* విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నేడు NIAకు బదిలీ
* కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు KTR.. భారీగా మోహరించిన పోలీసులు

News July 8, 2025

12లోగా MPTC స్థానాల తుది జాబితా

image

TG: MPTCల పునర్విభజనను జులై 12లోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. పలు పంచాయతీలు మున్సిపాలిటీల్లో, కొన్ని పొరుగు పంచాయతీల్లో విలీనమవడం, జిల్లా మారడం వంటివి జరగడంతో డీలిమిటేషన్ చేయనుంది. ప్రతి మండలంలో కనీసం 5 MPTC స్థానాలు ఉండాలని, ఇవాళ ముసాయిదా స్థానాలు ప్రచురించాలని సూచించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించి 12న తుది జాబితాను ప్రకటించాలంది.

News July 8, 2025

వరుసగా మూడు సెంచరీలు చేసిన ముషీర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నారు. లౌబరో UCCEతో జరిగిన మ్యాచులో ముంబై ఎమర్జింగ్ టీమ్ తరఫున ఆడుతున్న ముషీర్ వరుసగా మూడో సెంచరీ చేశారు. 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశారు. అంతకుముందు నాటింగ్‌హమ్ షైర్‌తో జరిగిన మ్యాచులో సెంచరీతో పాటు ఆరు వికెట్లు తీయగా, కంబైన్డ్ నేషనల్ కౌంటీస్‌పైనా సెంచరీ చేశారు.