News August 15, 2024
తుంగభద్ర డ్యాం గేట్ ఏర్పాటు ప్రక్రియ షురూ
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేటు బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడి పర్యవేక్షణలో తాత్కాలిక గేటును అమరుస్తున్నారు. రేపు సాయంత్రంలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10న 19వ క్రస్ట్ గేట్ విరిగి కొట్టుకుపోయింది. కొత్త గేట్ ఏర్పాటు చేసేందుకు నీటిని దిగువకు వదలాల్సి రావడంతో ఆరు రోజుల్లో 45 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
Similar News
News January 20, 2025
చైనా దూకుడు.. ఏడాదిలో 800KMS మెట్రో మార్గం పొడిగింపు!
దేశంలోని నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కిస్తోన్న మెట్రో రైళ్లను విస్తరించడంలో ఇండియా స్పీడు పెంచాల్సి ఉంది. 2024లో ఇండియాలో కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అదే చైనాలో మాత్రం ఒకే ఏడాదిలో 800+కి.మీలు మెట్రో మార్గాన్ని విస్తరించారు. కాగా, ఇండియాలో మొత్తం 1,000 కి.మీల మెట్రో మార్గం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
News January 20, 2025
భారీగా IPSల బదిలీ
APలో 27 మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
*పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనా
*కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్
*కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్
*ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు
*తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
*ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు
*IGP ఆపరేషన్స్‌గా సీహెచ్ శ్రీకాంత్
News January 20, 2025
జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు
రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్‌ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్‌గా రూ.299 ప్లాన్‌కు బదిలీ అవుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.