News August 15, 2024
వీవీఎస్‌కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.
News November 7, 2025
USలో అనుమానిత పౌడర్‌తో సైనికుల అస్వస్థత

అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్‌బేస్‌లో కెమికల్ పౌడర్‌తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్‌కు గురువారం వచ్చిన పార్శిల్‌ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్లాక్‌ను సీల్ చేసి, సమీప భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది.


