News August 15, 2024
అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారు: వైసీపీ

AP: అన్న క్యాంటీన్లను CM చంద్రబాబు పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారని YCP విమర్శించింది. ‘అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు. వాటికి TDP రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరిస్తున్నారు. ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం ఆయనకే కావాలి’ అని ట్వీట్ చేసింది. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని దాతలను CM కోరిన సంగతి తెలిసిందే.
Similar News
News January 7, 2026
ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
News January 7, 2026
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్ 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ(సైకాలజీ) ఫైనల్ ఇయర్, B.TECH/BE(CSE) ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.5వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in
News January 7, 2026
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.2,83,000కు చేరింది. మూడు రోజుల్లోనే రూ.26వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,27,850 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


