News August 15, 2024
మీకోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్

పాడేరు: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున శుక్రవారం జరగబోయే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్.దినేశ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీకోసం కార్యక్రమం రద్దు చేసినందున ప్రజలు గమనించి ఫిర్యాదులు అందజేయడానికి రావద్దని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 12, 2026
గ్రేటర్ విశాఖ బడ్జెట్ ఎంతంటే?

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.4047.12 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ నిల్వగా రూ.365.96 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం జమలు రూ.4180.37 కోట్లు కాగా, వ్యయం రూ.4047.12 కోట్లుగా అంచనా వేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ బడ్జెట్‌ను స్థాయి సంఘం ఆమోదించింది.
News January 12, 2026
విశాఖ: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రధాన నిందితులకు బ్యాంక్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. రంగారెడ్డికి చెందిన కనుకుట్ల సంతోష్ రెడ్డి, ఖమ్మంకు చెందిన అబ్బూరి గోపిలను అరెస్ట్ చేశారు.
News January 12, 2026
విశాఖలో తాగునీటి సమస్యలా? ఈ నెంబరుకు కాల్ చేయండి

నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని జీవీఎంసీ అందిస్తుందని జీవీఎంసీ కమీషనర్ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. నీటి సరఫరాలో సమస్యలు కలిగినట్లయితే వెంటనే జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. తాగునీటి పైపుల లీకేజీ, కలుషిత నీరు, కాలువలలో నీటి పైప్ లైన్ల లీకేజీ, తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు.


