News August 15, 2024

BREAKING: నంద్యాల జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ

image

నంద్యాల జిల్లాలో మరోసారి భారీగా ఎస్ఐలు బదిలీ అయ్యారు. 23 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 మందికి వివిధ మండలాలకు పోస్టింగ్ ఇవ్వగా, మరో ఇద్దరు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేశారు. మరోవైపు ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఏడుగురు ఎస్ఐలకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 25, 2025

ఆదోని మండల విభజనపై స్థానికుల నిరసన

image

​ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో ‘పెద్ద హరివాణం’ మండలాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త మండల కేంద్రం కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల చాలా గ్రామాలకు 40 కిలోమీటర్ల దూరం అవుతుందని ఆందోళన, నిరసనలు చేపట్టారు. ఈ అభ్యంతరాలపై రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. ఈ నెల 28న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News December 24, 2025

కర్నూలు SP కీలక నిర్ణయం

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

News December 24, 2025

నేర నివారణే లక్ష్యంగా పనిచేయాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్