News August 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 16, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:44 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:59 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:47 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:41 గంటలకు
✒ ఇష: రాత్రి 7.57 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News July 9, 2025

రేపు మరోసారి ఆస్పత్రికి కేసీఆర్

image

TG: బీఆర్ఎస్ అధినేత KCR రేపు ఉదయం మరోసారి HYD సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో 2రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన నంది‌నగర్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. రేపు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

News July 9, 2025

ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

News July 9, 2025

మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

image

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.