News August 16, 2024

నామినేటెడ్ పోస్టులకు 23 వేల దరఖాస్తులు?

image

AP: వివిధ ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం సుమారు 23 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 2,500 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. కార్యకర్తల్లో అసంతృప్తి రగలకుండా ఈ వారంలోనే తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన 31 మంది నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జిలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచినవారికి కూడా పదవులు దక్కనున్నాయి.

Similar News

News July 5, 2025

IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

image

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.

News July 5, 2025

మరో 30, 40 ఏళ్లు జీవించాలని ఉంది: దలైలామా

image

ప్రజలకు సేవ చేసేందుకు మరో 30, 40 ఏళ్లు జీవించాలని ఆశగా ఉందని టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. బుద్ధుడి బోధనల వ్యాప్తికి కృషి చేస్తానని చెప్పారు. రేపు ఆయన 90వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో అవలోకితేశ్వర ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాగా తనకు 90 ఏళ్లు నిండటంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

News July 5, 2025

మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటన మాది కాదు: మావోయిస్టు కమిటీ

image

ఆదివాసీల హక్కులను మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదంటూ June 26న విడుదలైన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావోయిస్టు TG కమిటీ స్పష్టం చేసింది. మావోయిస్టు దామోదర్ లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తలూ అవాస్తవమని, పోలీసులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. మావోల సమాచారం కోసం MLG, భద్రాద్రి, ASF జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది.