News August 16, 2024
రోడ్ల నిర్మాణం తర్వాతే భవనాల పనులు: ప్రభుత్వం

AP: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టే పనుల్లో గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, మురుగు కాలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాతే అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించింది. గత ప్రభుత్వం 35వేలకు పైగా భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. ఇందులో 80 శాతం లోపు పనులు పూర్తయిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టనుంది.
Similar News
News July 5, 2025
రేపు తొలి ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు: పండితులు

హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న (ఆదివారం) వచ్చింది. రేపు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు B.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్రమే విట్నెస్ నమోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహలు వీడాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవరితోనైనా సంతకం చేయించొచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
గిల్ సరికొత్త చరిత్ర

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్‌గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్‌గానూ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్‌తో ఆడుతున్నారు.