News August 16, 2024
వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు!
ఈరోజు వరలక్ష్మీ వ్రతం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎంతో ఏకాగ్రత అవసరం. కలశాన్ని ఏర్పాటు చేసుకున్నవారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి లేదా రాగి ప్లేట్లు వాడుకోవచ్చు. గణపతి పూజ చేశాకే లక్ష్మీపూజ చెయ్యాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టవద్దు. వాట్సాప్ స్టేటస్‌ల కోసం వ్రతం చేస్తే ముక్తి ఉండదని పెద్దలంటున్నారు.
Similar News
News January 22, 2025
స్కూళ్లకు గుడ్‌న్యూస్
APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
News January 22, 2025
‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం
AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.
News January 22, 2025
ఏంటీ ‘బర్త్ టూరిజం’?
పిల్లలకు US పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి అక్కడికి వెళ్తుంటారు. దీన్నే ‘బర్త్ టూరిజం’ అంటారు. US అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలికారు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా, తాత్కాలిక వీసాపై నివాసం ఉన్నా.. వారికి పుట్టబోయే బిడ్డకు జన్మత: అక్కడి పౌరసత్వం వర్తించదు.