News August 16, 2024
నల్గొండ జిల్లాలో 33,501 మంది రైతులకు రుణమాఫీ

రూ.2లక్షల లోపు పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతలో భాగంగా మాఫీ చేసింది. ఈ మేరకు గురువారం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 33,501 మంది రైతులకు రూ.442.86 కోట్లు విడుదలయ్యాయి. అయితే గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో రైతుల ఖాతాల్లో ఆ నిధులు జమకాలేదు. శుక్రవారం ఉదయం రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
NLG: ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టండి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కారం కావాలని, ఏ ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News November 10, 2025
NLG: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ర్యాగింగ్ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడి తోటి విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దని, అలా చేస్తే, ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ కింద 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
News November 10, 2025
NLG: ప్రజావాణికి 94 ఫిర్యాదులు

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి. అందులో జిల్లా అధికారులకు సంబంధించి 31 ఫిర్యాదులు, రెవిన్యూ శాఖకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అన్నారు.


