News August 16, 2024
కమలను విమర్శించడం నా హక్కు: ట్రంప్
డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను వ్యక్తిగతంగా విమర్శించే హక్కు తనకుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆమె తనపై అలాగే దాడి చేసిందన్నారు. తనతో సహా చాలామందిపై దాడికి న్యాయ వ్యవస్థను ఆమె ఆయుధంగా వాడుకున్నారని ఆరోపించారు. ఆమె, ఆమె తెలివితేటలపై తనకు అస్సలు గౌరవం లేదన్నారు. ఒకవేళ ఆమె గెలిస్తే ఘోరమైన అధ్యక్షురాలు అవుతుందని పేర్కొన్నారు. అందుకే తాను గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Similar News
News January 22, 2025
వైస్ ప్రెసిడెంట్‌గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.
News January 22, 2025
స్కూళ్లకు గుడ్‌న్యూస్
APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
News January 22, 2025
‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం
AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.