News August 16, 2024
కావలి: తాహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం..!
కావలి మాజీ ఎమ్మెల్యే కారు చోదకుడిగా పని చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో స్థలం కొనుగోలుతో పాటు ఇలాగ అనేక అక్రమాలు పాల్పడిన వ్యక్తికి అప్పటి తాహశీల్దార్ సహకరించారన్న సమాచారంతో తహసీల్దారుపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ నాయకులతో అంటకాగి అక్రమాలకు పాల్పడిన వారి పాపాలు పండుతున్నాయి. ఈ క్రమంలో గతంలో పనిచేసిన ఓ తాహశీల్దార్‌పై సస్పెండ్ వేటు పడనున్నట్లు సమాచారం.
Similar News
News November 18, 2024
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం వికేంద్రీకరణ: కలెక్టర్ ఆనంద్
ప్రజల వద్దకు పరిపాలనను మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వికేంద్రీకరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రేపటి నుంచి మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్ర కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చునని ఆయన వివరించారు.
News November 17, 2024
ఫిర్యాదులకు ఆధార్ తప్పనిసరి: నెల్లూరు SP
ప్రతి ఫిర్యాదుదారులు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదు చేసే ప్రతి ఒక్క ఫిర్యాదుదారులు తమ వ్యక్తిగత ఆధార్ కార్డు జిరాక్స్ ఫిర్యాదులో పొందుపరచాలని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు.
News November 17, 2024
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బొల్లినేని
మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటి వార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాల్గొన్నారు.