News August 16, 2024

మహిళలను కించపరిచే ఉద్దేశం లేదు: KTR

image

TG: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన <<13865400>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదం కావడంపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు KTR వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Similar News

News February 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. గత ఆదివారం KG చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.240-250 ఉండగా ఇవాళ రూ.220-230గా ఉంది. అయితే AP, TGలోని పలు జిల్లాల్లో రేట్లలో తేడాలున్నాయి. ఇటీవల అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లు చనిపోతున్న కృష్ణా, ప.గో, నిజామాబాద్‌ జిల్లాల్లో ధర రూ.200 దిగువకు పడిపోయింది. అటు మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.280 కూడా పలుకుతోంది. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?

News February 9, 2025

రేషన్ కార్డులపై ఏమిటీ గందరగోళం?

image

TG: ప్రజాపాలన, సర్వేలో వినతుల మేరకు కొత్త రేషన్ కార్డులిస్తామని ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ మీసేవలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇంతలో EC దీనికి బ్రేక్ వేసిందని వార్తలొచ్చాయి. మరోవైపు మీసేవలో అప్లై చేసుకోవడానికి వీలులేదని సర్కార్ చెప్పింది. ఇక కార్డుల జారీకి తాము బ్రేక్ వేయలేదని EC తెలిపింది. వీటన్నింటితో ‘ఇక కార్డులు వచ్చినట్టే’ అని ప్రజలు నిట్టూరుస్తున్నారు.

News February 9, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5L మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు ₹లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

error: Content is protected !!