News August 16, 2024
EOS-08 శాటిలైట్ ప్రయోగం ఎందుకంటే?

SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. దీని బరువు 175KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు. సముద్రాలపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, అగ్నిపర్వత పేలుళ్లు, పారిశ్రామిక విపత్తులు, వరదలను గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ మిషన్ ఏడాదిపాటు సేవలందిస్తుంది.
Similar News
News January 1, 2026
40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.
News January 1, 2026
IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.
News December 31, 2025
2026లో టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

టీమ్‌ఇండియా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్, 3 మ్యాచుల ODI సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో T20 వరల్డ్ కప్, జూన్‌లో AFGతో 3 వన్డేలు, 1 టెస్ట్, జులైలో ENGతో 5 T20s, 3 ODIs, AUGలో SLతో రెండు టెస్టులు, సెప్టెంబర్‌లో AFGతో 3 T20s, WIతో 3 వన్డేలు, 5 T20s, ఆక్టోబర్-నవంబర్‌లో NZతో 2 టెస్టులు, 3 వన్డేలు, డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది.


