News August 16, 2024
ఎమ్మెల్సీలుగా కాసేపట్లో ప్రమాణం చేయనున్న కోదండరామ్, అలీఖాన్
TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అలీఖాన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వీరిని నామినేట్ చేయగా దీనిపై BRS హైకోర్టుకు వెళ్లింది. నియామక గెజిట్‌ను HC కొట్టివేయడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వానికి అనుకూలంగా SC నిన్న తీర్పిచ్చింది.
Similar News
News January 21, 2025
కింగ్ రిటర్న్ అయ్యారు: ఎలన్ మస్క్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన వేళ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ట్రంప్ అకౌంట్‌ను గతంలో ట్విటర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆనాటి, ప్రస్తుతం ఆయన పేరు పక్కన యాడ్ అయిన అధ్యక్షుడు అనే అక్షరాలు కనిపించేలా ‘కింగ్ రిటర్న్ అయ్యారు’ అంటూ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కీలకంగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
News January 21, 2025
నెలాఖరున ‘RC16’లో జాయిన్ కానున్న చెర్రీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ ‘RC16’ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 25% షూటింగ్ పూర్తి చేసుకున్న ‘RC16’ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
News January 21, 2025
డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నాం: గంగూలీ
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ గంగూలీ అండగా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలు కాగానే డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నామని చెప్పారు. హిట్‌మ్యాన్ వైట్‌బాట్ క్రికెట్ అద్భుతంగా ఆడతారని ప్రశంసించారు. CT-2025 ఫిబ్రవరి 19న మొదలు కానుండగా భారత్ తన తొలి మ్యాచ్ 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్ జట్టుతో ఆడనుంది.