News August 16, 2024

బంగారంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే..

image

స్థిరమైన, సురక్షితమైన పెట్టుబడి అంటే గుర్తొచ్చేది బంగారం. బలహీనమైన డాలర్, ఎకానమీ, ఆర్థిక, యుద్ధ సంక్షోభ సమయాల్లో ఇంతకు మించిన ఆర్థిక సాధనం మరొకటి లేదని నానుడి. పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టాలని చాలామందికి సందేహం. మీ పోర్టుఫోలియోలో 10-15% వరకు పెడితే సమతూకం వస్తుందని ఆర్థిక నిపుణులు, ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ETF, గోల్డ్ MF, SGBల్లో అనువైనది ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.

Similar News

News January 21, 2025

మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 21, 2025

ఎంపీల కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష

image

AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్య‌సభ సభ్యుల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది.

News January 21, 2025

కుంభమేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!

image

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ NLB సర్వీసెస్‌ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, రవాణా, వైద్య శిబిరాల్లో లక్షల మందికి పని దొరికిందని చెప్పింది.