News August 16, 2024

ప్రశ్నించినందుకు వైద్యురాలి ఇంటికి పోలీసులు!

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మరువక ముందే మరో వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. బర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పోలీసులు అడ్రెస్ తెలుసుకొని తన ఇంటికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాత్రిపూట పోలీసులు ఇంటికి రావడంతో తన తల్లి భయాందోళనకు గురైందని, పోస్ట్ డిలీట్ చేయాలని వారు బెదిరించినట్లు చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

Similar News

News February 11, 2026

ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

image

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం

News February 11, 2026

అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.

News February 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.