News August 16, 2024
మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా?

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో లోక్రెడిట్ స్కోర్ ఒకటి. క్రెడిట్ కార్డు యూజర్లు గడువుకు ముందే బిల్లు చెల్లిస్తే స్కోర్ క్రమంగా మెరుగవుతుంది. ఒకవేళ మీ బిల్లు ఎక్కువగా ఉంటే రెండు విడతల్లో చెల్లించేందుకు ప్రయత్నించండి. ఉదా.మీరు Sep 2న రూ.20వేలు చెల్లించాల్సి ఉందనుకుందాం. Aug 20న రూ.10వేలు, Sep 1న మరో రూ.10వేలు చెల్లించండి. క్రెడిట్ స్కోరు తక్కువుంటే లోన్స్ దొరకడం కష్టతరం అవుతుంది.
Similar News
News November 5, 2025
న్యూస్ రౌండప్

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు
News November 5, 2025
ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <
News November 4, 2025
‘ఇండియా’ గ్లోబల్ సూపర్ పవర్: ఇజ్రాయెల్ మంత్రి

ఇండియా ‘గ్లోబల్ సూపర్ పవర్’ కంట్రీ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ అభివర్ణించారు. 2 దేశాల సంబంధాలు గతంలో కన్నా మరింత బలపడ్డాయని NDTVతో చెప్పారు. డిఫెన్స్, ట్రేడ్, కౌంటర్ టెర్రరిజమ్, ట్రేడ్‌లలో తమ బంధాన్ని విస్తరించామన్నారు. హమాస్ దాడి సమయంలో మద్దతుగా నిలిచిన ఇండియాను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని తెలిపారు. తమకు ముప్పుగా ఉన్న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించలేమన్నారు.


