News August 16, 2024

జమ్మికుంట మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 17న శనివారం వారాంతపు యార్డు బంద్‌, 18న ఆదివారం సాధారణ సెలవు, 19న సోమవారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సెలవు ఉన్నట్లు తెలిపారు. తిరిగి 20న మంగళవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించాలన్నారు.

Similar News

News September 19, 2025

KNR: పత్తి సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారంసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News September 19, 2025

KNR: ‘పాఠశాలల్లో విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన’

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులను అనుసరించి విద్యాబోధన చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.

News September 19, 2025

కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.