News August 16, 2024

కాసేపట్లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన

image

నేషనల్ ఫిల్మ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను కేంద్రం కాసేపట్లో ప్రకటించనుంది. ఉత్తమ నటుల కేటగిరీలో మమ్ముట్టి(నాన్‌పకల్ నెరత్తు మయక్కం), రిషభ్ శెట్టి(కాంతార), విక్రమ్(పొన్నియన్ సెల్వన్), విక్రాంత్ మాసే(12th ఫెయిల్) బరిలో నిలిచారు. విజేతలకు అక్టోబర్‌‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందజేస్తారు. కాగా పుష్ప మూవీలో నటనకుగానూ అల్లు అర్జున్‌ను గతేడాది జాతీయ అవార్డు వరించింది.

Similar News

News January 15, 2025

ధూమపానం, మద్యపానం, అధిక బరువుతో అనేక క్యాన్సర్లు!

image

ధూమపానం, మద్యపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించడాన్ని మానేస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు వల్ల 13 రకాల క్యాన్సర్లు, స్మోకింగ్ వల్ల ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావొచ్చని తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. అందుకే వీటిని మానేసి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదంటున్నారు.

News January 15, 2025

ప్రేమించిందని పోలీసుల ముందే కూతురిని చంపిన తండ్రి

image

MPకి చెందిన మహేశ్ గుర్జార్ తన కూతురు తనూ(20)కు మరో 4 రోజుల్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇంతలో తాను విక్కీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబీకులు ఒప్పుకోవడంలేదంటూ తనూ SMలో ఓ వీడియో పెట్టింది. విషయం పోలీసులకు, గ్రామస్థులకు తెలియడంతో నచ్చజెప్పేందుకు పంచాయితీ పెట్టారు. ఈక్రమంలోనే తండ్రీకూతురు మధ్య వాగ్వాదం జరగడంతో అందరి ముందే తనూను మహేశ్ కాల్చి చంపాడు.

News January 15, 2025

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025

image

*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్‌సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్
*జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్