News August 16, 2024

HNK: శ్రావణమాసంలో భారీగా పెరిగిన పూల ధరలు

image

శ్రావణ మాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతాల కారణంగా హనుమకొండలో పూల ధరలు మూడింతలు పెరిగాయి. దీనికి వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమూ ప్రభావం చూపుతోంది. గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550లు ఉండగా ఇప్పుడు రూ.1,500 పలుకుతోంది. తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, పసుపు చామంతి రూ.150 నుంచి రూ.400, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, లిల్లీ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1,200కు చేరాయి.

Similar News

News January 1, 2026

భద్రకాళి క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లువ.!

image

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కొత్త ఏడాదిని ప్రారంభించేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలవబడే భద్రకాళి అమ్మవారికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News January 1, 2026

వరంగల్: లక్ష్యసాధనకు పునరంకితం కావాలి: సీపీ

image

నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో ప్రారంభించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. 2026లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సామాజిక బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

News January 1, 2026

WGL: సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, శాంతి సమృద్ధి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా, సమాజ శ్రేయస్సును కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని, సానుకూల ఆలోచనలు విజయానికి తొలిమెట్టు అని ఆమె ఉద్ఘాటించారు.