News August 16, 2024
కాకినాడ మాజీ MLA ద్వారంపూడిపై ఫిర్యాదు

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్పీ విక్రాంత్ పటేల్‌కు ద్వారంపూడిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడలో దౌర్జన్యం, దాడులు చేశారని తెలిపారు.
Similar News
News January 9, 2026
పాసు పుస్తకాల్లో తప్పులు.. 16 వేల బుక్కులు వెనక్కి!

రీ సర్వేలో భాగంగా ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో 16,101 పుస్తకాలను వెనక్కి పంపినట్లు తూ.గో. డీఆర్వో సీతారామమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 1,04,618 పుస్తకాలను పరిశీలించగా ఇవి వెలుగుచూశాయన్నారు. బ్యాంకుల్లో తాకట్టు ఉన్న పాత పుస్తకాలను ఇచ్చి కొత్తవి తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు పేర్కొన్నారు. రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు వెల్లడించారు.
News January 9, 2026
సంక్రాంతి వేళ డ్రోన్ల నిఘా.. ఎస్పీ వార్నింగ్!

సంక్రాంతి వేళ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నర్సింహ కిషోర్ వెల్లడించారు. భద్రతలో భాగంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు. నేర నియంత్రణకు పోలీస్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
News January 9, 2026
రాజమండ్రి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా

రాజమండ్రిలో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్‌ను మాజీ ఎంపీ మార్గాని భరత్ గురువారం విడుదల చేశారు. మంజీర కన్వెన్షన్‌లో ఈ మెగా జాబ్ కార్యక్రమం జరగనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని భరత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన కోరారు.


