News August 16, 2024
స్వర్ణాంధ్రప్రదేశ్-2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: CM CBN
AP: స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో-ఛైర్‌గా ఉంటారని తెలిపారు. ఇందులో మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. చంద్రశేఖరన్‌తో సీఎం తాజాగా భేటీ అయ్యారు. అమరావతిలో CII ఏర్పాటు చేయనున్న GLCలో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించిందని తెలిపారు.
Similar News
News January 21, 2025
యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు
TG: నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనర్సింహా ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో రూ.1,137కోట్లు చెల్లించామని, మరో 6 నెలల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇతర సమస్యలపైనా కమిటీ ఏర్పాటు చేసి, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.
News January 21, 2025
మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. కీలక అప్‌డేట్
TG: ఈనెల 26 నుంచి ‘<<15192924>>ఇందిరమ్మ ఆత్మీయ భరోసా<<>>’ అమలు కానున్న విషయం తెలిసిందే. 2023-24లో ఉపాధి హామీ స్కీమ్‌లో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలుంటే వారిద్దరిలో పెద్ద వయస్కురాలి ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద అకౌంట్‌లో నగదు వేస్తారు.
News January 21, 2025
క్షేమంగానే మావోయిస్టు నేత దామోదర్!
TG: ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ చనిపోయినట్లు ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తాను క్షేమంగానే ఉన్నట్లు దామోదర్ కుటుంబీకులకు చేరవేసినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో 16మంది మావోలు చనిపోయిన విషయం తెలిసిందే.