News August 16, 2024

ALERT.. 5 రోజుల పాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Similar News

News July 6, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.

News July 6, 2025

చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జున‌సాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.

News July 6, 2025

మా విషయం ఇండియా మొత్తం తెలుసు: చాహల్

image

ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.