News August 16, 2024
వినేశ్ చనిపోతుందేమోనని భయపడ్డాను: కోచ్
బరువు తగ్గేందుకు చేసిన కసరత్తులతో వినేశ్ ఫొగట్ చనిపోతుందేమోనని భయపడినట్లు ఆమె కోచ్ ఎకోస్ FBలో పోస్ట్ చేశారు. ‘మొదట 80ని. కసరత్తు చేయిస్తే 1.2KGలే తగ్గింది. స్టీమ్‌బాత్, కార్డియో, రెజ్లింగ్ మూవ్స్ చేయించాం. ఒంటి నుంచి కనీసం చెమట చుక్క రాలేదు. ఆమె కుప్పకూలడంతో చాలా భయమేసింది. మళ్లీ లేపి స్టీమ్‌బాత్‌కు పంపించాం’ అని ఆయన వివరించారు. అయితే ఈ పోస్ట్‌ను ఎకోస్ డిలీట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Similar News
News January 22, 2025
ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు మరో 2 నెలలు బంద్
AP: నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా, పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2 నెలలు పొడిగించింది. అక్రమాలపై పూర్తి సమాచారం పంపాలని కలెక్టర్లను ఆదేశించింది.
News January 22, 2025
ఆ ఉద్యోగాల దరఖాస్తులకు రేపటి నుంచి అవకాశం
AP: సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/ జనరల్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31వరకు అవకాశం కల్పిస్తూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్ణయించింది. గత నెలలో 97 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాగా, మరో 200 పోస్టులను కలిపిన నేపథ్యంలో కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు.
News January 22, 2025
అన్నలను కంగారు పెడుతున్న ‘ఆపరేషన్ కగార్’
బస్తర్‌లోని అబూజ్‌మఢ్ అడవుల్లో అన్నల ఆధిపత్యానికి గండిపడింది. ‘కగార్’ పేరుతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌కు మావోయిస్టుల కంచుకోట కకావికలం అయింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకొని నక్సల్స్‌పైకి పంపారు. వీరికి తోడు CRPF, కోబ్రా బలగాలతో డ్రోన్లను ఉపయోగించి నక్సల్స్ జాడ పసిగట్టి చుట్టుముట్టి దాడి చేస్తున్నారు. దీంతో ఏడాదిలో 42 ఎన్‌కౌంటర్లు జరగగా అగ్రనేతలు సహా 300 మంది నక్సల్స్ హతమయ్యారు.