News August 16, 2024
MBNR: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వేపూరు గ్రామానికి చెందిన యాదయ్య వంట మాస్టర్. గత కొకొన్ని రోజులుగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఉంటూ జీవనం సాగించేవాడు. యాదయ్య రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య కొడుకు కూతురు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 26, 2026
MBNR: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి.జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, కఠిన పర్యవేక్షణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 26, 2026
సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుక్ చేసుకోండి

భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. మరింత సమాచారంకు 9154298637 సంప్రదించాలన్నారు.
News February 26, 2026
MBNR: ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం

2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఖుష్బూ గుప్త ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియామకం అయ్యారు. తొలుత బీహార్ కేడర్‌కు ఎంపికైన ఆమె, వివాహానంతరం తెలంగాణ కేడర్‌కు మారారు. ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఆమె 2018 యూపీఎస్సీ పరీక్షలో AIR 80 సాధించారు. పంజాబ్‌లోని భదౌర్ ఆమె స్వస్థలం. ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో గిరిజన బాలికల విద్యపై విశేష సేవలు అందించారు.


