News August 16, 2024

కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: మంత్రి సురేఖ

image

TG: మహిళలపై చేసిన <<13867346>>వ్యాఖ్యలకు<<>> బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్‌లో క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ మహిళా సమాజానికి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రేక్ డాన్సులకు అలవాటుపడిన వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని దుయ్యబట్టారు.

Similar News

News January 21, 2025

POSTER: కొత్త లుక్‌లో రష్మిక

image

ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఛావా’ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రష్మిక లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.

News January 21, 2025

నక్సలిజం చివరి దశలో ఉంది: అమిత్ షా

image

ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్‌కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు. ‘నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో ఇరు రాష్ట్రాల బలగాలు, CRPF జాయింట్ ఆపరేషన్‌లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. దేశంలో నక్సలిజం ఊపిరులు చివరికి చేరాయి’ అని ట్వీట్ చేశారు.

News January 21, 2025

-800 నుంచి +70 వరకు పుంజుకున్న సెన్సెక్స్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకానొక దశలో 800pts పతనమైన సెన్సెక్స్ 77,337 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాసేపటికే పుంజుకొని 70pts లాభంతో 77,141 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 150pts తగ్గిన నిఫ్టీ 23,426 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు 30pts పెరిగి 23,376 వద్ద చలిస్తోంది. ట్రంప్ టారిఫ్స్‌, అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణాలు.