News August 16, 2024

IPSల బదిలీ

image

ఏపీలో 10 మంది IPSలను ప్రభుత్వం బదిలీ చేసింది.
*అనంతపురం ఎస్పీగా పి.జగదీశ్
*గ్రేహౌండ్స్ కమాండర్‌గా గరుడ్ సుమిత్ సునీల్
*చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా
*గుంతకల్లు SRPగా రాహుల్ మీనా (రైల్వే పోలీసు)
*విజయవాడ డీసీపీగా కేఎం మహేశ్వర్ రాజు
*ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
*పార్వతీపురం SPDOగా అంకిత మహవీర్

Similar News

News January 21, 2025

నక్సలిజం చివరి దశలో ఉంది: అమిత్ షా

image

ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్‌కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు. ‘నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో ఇరు రాష్ట్రాల బలగాలు, CRPF జాయింట్ ఆపరేషన్‌లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. దేశంలో నక్సలిజం ఊపిరులు చివరికి చేరాయి’ అని ట్వీట్ చేశారు.

News January 21, 2025

-800 నుంచి +70 వరకు పుంజుకున్న సెన్సెక్స్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకానొక దశలో 800pts పతనమైన సెన్సెక్స్ 77,337 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాసేపటికే పుంజుకొని 70pts లాభంతో 77,141 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 150pts తగ్గిన నిఫ్టీ 23,426 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు 30pts పెరిగి 23,376 వద్ద చలిస్తోంది. ట్రంప్ టారిఫ్స్‌, అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణాలు.

News January 21, 2025

RECORD: 2 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్

image

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచేందుకు అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం చాహల్ (80 మ్యాచుల్లో 96 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ 2 వికెట్లు తీస్తే చాలు చాహల్‌ను అధిగమిస్తారు. ఆయన ఇప్పటివరకు 60 మ్యాచులాడి 95 వికెట్లు తీశారు. కాగా ENGతో సిరీస్‌కు చాహల్ సెలక్ట్ కాని విషయం తెలిసిందే.