News August 16, 2024

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

image

ఐపీఎల్‌లో ప్లేయర్ల రిటైనింగ్‌పై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో స్టార్ ప్లేయర్ ధోనీని CSK అన్‌క్యాప్డ్‌ కేటగిరీలో తీసుకోనున్నట్లు జాతీయ మీడియా కథనం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్లేయర్లను అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా గుర్తించే నిబంధనకు BCCI అనుమతించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇదే నిజమైతే తక్కువ ధరకే మిస్టర్ కూల్‌ని సీఎస్కే సొంతం చేసుకునే అవకాశముంది.

Similar News

News July 6, 2025

విదేశీ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

image

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్‌పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.

News July 6, 2025

మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

image

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

News July 6, 2025

‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

image

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.