News August 16, 2024
NTR జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ

NTR జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఎస్ఐలను భారీగా బదిలీ చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 100 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్‌లో ఉన్నా ఎస్ఐలకు స్థానచలనం కల్పించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం
News February 18, 2026
కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.
News February 18, 2026
కష్ణా: మూగబోయిన నాడు-నేడు ప్యూరిఫైర్లు

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శుద్ధ తాగునీటిని అందించేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన నాడు-నేడు పథకంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలు జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఐనా మరమ్మతులు చేపట్టలేదని, వేసవికి మునుపే మరమ్మతులు చేసి పిల్లలకు తాగునీరు అందించాలని పేరెంట్స్ కోరుతున్నారు.


