News August 17, 2024

లక్ష్యాలు సాధించడానికి సమష్టిగా కృషి చేయాలి: కలెక్టర్

image

వికసిత్ ఆంధ్ర-2047 లక్ష్యాలను సాధించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో వికసిత్ ఆంధ్రకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధునాతన పద్ధతులను వినియోగించడం ద్వారా ఉత్పత్తులు పెంచవచ్చునని, తద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.యాక్షన్ ప్లాన్ తయారీలో అధికారులు విజన్‌తో పని చేయాలన్నారు.

Similar News

News January 10, 2026

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

image

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

News January 10, 2026

ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరాదు: డీటీసీ

image

విశాఖలో ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో డీటీసీ ఆర్సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. దూర ప్రయాణాల కోసం తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని, ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయొద్దని.. బస్సుల్లో హెల్ప్ లైన్ నంబర్ 9281607001 స్పష్టంగా పెట్టాలన్నారు.

News January 9, 2026

విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (1/2)

image

విశాఖ మెట్రో ప్రాజెక్టు మరోసారి <<18813242>>జాప్యం<<>> దిశగా సాగుతోంది. తాజాగా కేంద్రం ఫీజబులిటీ రిపోర్ట్ సమర్పించాలని కోరడంతో ఆలస్యం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPRపై కేంద్రం కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం, నిర్వహణ వ్యయం, బ్రేక్‌ ఈవెన్ కాలంపై స్పష్టత కోరింది.