News August 17, 2024
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సిరాజ్ పోస్ట్.. వైరల్

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ స్పందించారు. పురుషాధిక్య వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటిలాగే ఆమెదే తప్పంటారేమో? ఈ సారి ఎలా తప్పించుకోబోతున్నారు? ఏం సాకులు వెతకబోతున్నారు? మగాడు ఎల్లప్పుడూ మగాడే అంటారు కదా. ఇలాంటి దురాగతాల్లో మహిళలదే తప్పు అంటారేమో’ అని అర్ధం వచ్చేలా పలు వార్తా క్లిప్పింగులను ఆయన షేర్ చేశారు.
Similar News
News July 6, 2025
ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ..

బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.
News July 6, 2025
F-35B గురించి తెలుసా?

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
News July 6, 2025
విజయానికి 5 వికెట్లు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.