News August 17, 2024
MBNR: హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లా నుంచి 2025లో పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటున్న ఔత్సాహికులు ఆన్లైన్లో హజ్ కమిటీ కార్యాలయం నుంచి దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించామని హజ్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరాజుద్దీన్ తెలిపారు. 2024 సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, పాస్ పోర్టు కాపీ జిరాక్సు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఓటరు గుర్తింపు కార్డు, తదితర పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News May 8, 2025
మహబూబ్నగర్ రూరల్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.