News August 17, 2024
వ్యవసాయ రుణాలు మాత్రం 10 శాతం దాటలేదు: జూపల్లి
వనపర్తి జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతు రుణమాఫీ ద్వారా జిల్లాలో దాదాపు రూ.400 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని, వ్యవసాయ రుణాలు మాత్రం 10 శాతం దాటలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సం రూ.3,454.92 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకోగా జూన్, 2024 వరకు కేవలం రూ.324.92 కోట్లు ఇచ్చిందని అన్నారు.
Similar News
News November 28, 2024
MBNR: నేడు పాలమూరుకు మంత్రులు రాక
MBNR జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువారం ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
News November 28, 2024
MBNR: GET READY.. రేపటి నుంచి రైతు పండుగ
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ మైదానంలో గురువారం నుంచి మూడు రోజులపాటు “రైతు పండుగ” ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుధవారం రైతు పండుగ సభకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
News November 27, 2024
ప్రధాని మోదీతో ఎంపీ డీకే అరుణ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని నిర్వహించిన కీలక సమావేశంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.