News August 17, 2024
హృదయవిదారకం: ‘అమ్మా.. లే అమ్మా’

AP: ఏ కష్టమొచ్చిందో తెలియదు. పద్మ అనే మహిళ రెండేళ్ల కూతురు పుష్పను నడుముకు కట్టుకుని చెట్టుకు ఉరివేసుకుంది. బాలిక ఆకలితో రెండు రోజులపాటు ‘లే అమ్మా’ అంటూ రోదించింది. కట్టు విడిపోవడంతో కిందపడిన బాలిక ఒళ్లంతా దోమకాట్లతో ఏడ్చుకుంటూ రోడ్డుపైకి రావడంతో స్థానికులు గుర్తించి కాపాడారు. ఈ హృదయవిదారక ఘటన అల్లూరి(D) అరకులోయ(M) పద్మాపురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2026
CIPETలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(CIPET)11 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 9 -మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME/MTech, PhD, MBA, PG పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు మేనేజర్‌కు రూ.78,800, Sr. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.67,700 చెల్లిస్తారు. సైట్: https://www.cipet.gov.in
News February 8, 2026
జైలుకెళ్లిన ప్రముఖ జ్యోతిషుడు.. బ్యాగ్రౌండ్ చూస్తే

కర్ణాటక జ్యోతిషుడు కమలాకర్ భట్ ఫ్లాష్‌బ్యాక్ సినిమా స్టోరీనే. తమలపాకులు, మరమరాలు అమ్మిన ఆయన.. జ్యోతిషుడైతే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో ఆ విద్య నేర్చాడు. త్వరగా పాపులరవ్వాలని TVల్లో ఆస్ట్రాలజీ చెప్పాడు. సమస్యలున్న వారిని తీసుకొచ్చే ఏజెంట్లకు కమీషన్ ఇస్తూ ₹వందల కోట్లు పోగేశాడు. ఏజెంట్ సుచిత్రతో అక్రమసంబంధం సాగిస్తూ, అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై గతవారం దాడి చేయించి జైలుకెళ్లాడు.
News February 8, 2026
మనకు చెడు చేసినవారు బంధువులైతే?

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||
జాలి పడొద్దు. సవాళ్లకు భయపడి బాధ్యతలు వీడొద్దు. రణరంగంలో ఎదురుగా ఎవరున్నారన్నది అనవసరం. వెనకడుగు వేయడం మనోదౌర్బల్యం. భయం, పిరికితనం వీడి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. పోరాటమే అసలు విజయం. అప్పుడే లక్ష్యం సాధిస్తాం. <<-se>>#MSBP<<>>


