News August 17, 2024
వాతావరణం నుంచి CO2ను లాగేసేలా కొత్త బయోమెటీరియల్

వాతావరణంలోని CO2ను వెలికితీసేందుకు సజీవ సూక్ష్మజీవులను ఉపయోగించే కన్‌స్ట్రక్షన్ బయోమెటీరియల్‌ను భారత విద్యార్థి ప్రంతర్ అభివృద్ధి చేస్తున్నారు. అతను యూనివర్సిటీ కాలేజ్ లండన్(UCL)లో బయోకెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నారు ‘ఈ మెటీరియల్‌ను భవనాల లోపలి గోడలపై అమర్చితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా CO2ను లాగేస్తుంది. మానవ నివాసాలను కార్బన్ రహిత ప్రదేశాలుగా మార్చడమే లక్ష్యం’ అని అతను తెలిపారు.
Similar News
News July 6, 2025
మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
News July 6, 2025
‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.
News July 6, 2025
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.