News August 17, 2024
భద్రత లేదంటూ గవర్నర్‌కు RG కర్ వైద్యుల వేడుకోలు

RG కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దుర్మార్గాలు జరుగుతున్నాయని అక్కడి వైద్యులు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు వివరించారు. తమ భద్రతపై 30-35 మందితో కూడిన బృందం ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. బుధవారం రాత్రి విధ్వంసం జరిగాక తాము సురక్షితంగా లేమన్న భావన కలుగుతోందని ఆవేదన చెందింది. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ వారికి హమీ ఇచ్చారు.
Similar News
News January 13, 2026
చిరంజీవి ‘MSVPG’ మూవీ పైరసీ

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఆన్లైన్ సైట్లలో ప్రత్యక్షమైంది. మూవీ రిలీజైన 24 గంటల్లోనే పైరసీ కాపీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఖుషీగా ఉన్న ఫ్యాన్స్.. పైరసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని మండిపడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 13, 2026
IPL 2026లో RCBకి కొత్త హోంగ్రౌండ్!

వచ్చే IPL సీజన్ కోసం RCBకి కొత్త హోంగ్రౌండ్స్ ఎంచుకుందన్న వార్తలు వైరలవుతున్నాయి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచులు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆడాల్సిన 7 హోంగ్రౌండ్ మ్యాచుల్లో 5 DY పాటిల్ స్టేడియం(నవీ ముంబై), 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని తెలుస్తోంది. RCB కప్పు కొట్టిందని చిన్నస్వామిలో నిర్వహించిన కార్యక్రమంలో 11మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 13, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్‌లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <


