News August 17, 2024

రంప: 108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

image

చింతూరు మండలం వంకలగూడెం గ్రామానికి చెందిన పార్వతికి పురిటి నొప్పులు రావడంతో ఏడుగురాళ్లపల్లి PHCకి తీసుకెళ్లేందుకు కుటుంబీకులు 108లో బయలుదేరారు. మార్గం మధ్యలో వాహనం రిపేర్‌కు గురై ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న PHC వైద్యాధికారి విశ్వచైతన్య వాహనం వద్దకు వచ్చి పురుడు పోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News August 24, 2025

తూ.గో: 5.59 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం

image

తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన 5,59,302 స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయిందని, వాటిని తహశీల్దార్ కార్యాలయాలకు పంపినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శనివారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కార్డుదారుల ఇళ్ల వద్దే వీటిని పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News August 24, 2025

‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

News August 23, 2025

చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.