News August 17, 2024
ముడి చమురుపై 47% తగ్గిన ట్యాక్స్

స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కత్తిరించింది. టన్నుపై రూ.4600 నుంచి రూ.2100కు తగ్గించింది. జులై 31కి ముందు పన్ను రేటు రూ.7000 వరకు ఉండేది. దేశ అవసరాల కోసం కాకుండా ఎక్కువ ధరకు విదేశాలకు ముడిచమురు ఎగుమతి చేస్తున్న కంపెనీలను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి 15 రోజులకు పన్ను రేటును సవరిస్తారు. వైమానిక ఇంధనంపై ఎలాంటి పన్నూ లేదు.
Similar News
News December 9, 2025
కడప జిల్లా SP కీలక సూచన.!

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
News December 9, 2025
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.


