News August 17, 2024
ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయింది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్), ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ ఎన్నిక కాగా తుది ఫలితాలను సెప్టెంబర్ 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
Similar News
News February 2, 2025
రాజకీయాల్లోకి ధోనీ? బీసీసీఐ VP ఏమన్నారంటే?
భారత మాజీ కెప్టెన్ ధోనీ మంచి రాజకీయ నేత కాగలరని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. వస్తే మాత్రం గెలుస్తారు. ఎందుకంటే ధోనీకి పాపులారిటీ ఎక్కువ. MPగా పోటీ చేస్తున్నావని విన్నాను.. నిజమేనా? అని ఒకసారి అడిగితే పోటీ చేయట్లేదని చెప్పారు. ఆయన ఫేమ్‌కి దూరంగా ఉండాలనుకుంటారు. మొబైల్ ఫోన్ కూడా వాడరు’ అని చెప్పారు.
News February 2, 2025
రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్
యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేరళలోని ఓ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలని ఆదేశించినా వారు రాకపోవడంతో కోర్టు తాజా తీర్పునిచ్చింది.
News February 2, 2025
వైరస్: లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
AP: ఉమ్మడి ప.గో. జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ DECలో మొదలై JAN నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 20లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు. అటు ఖమ్మం జిల్లాలోనూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.