News August 17, 2024

ADB: స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన చరణ్

image

తెలంగాణా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణా షార్ట్ కోర్స్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుడు సత్తా చాటారు. జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్ తేజ్ 1500 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించాడు. అదేవిధంగా 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలోనూ రెండవ స్థానంలో నిలిచి ప్రతిభ చాటాడు.

Similar News

News November 12, 2025

ఆదిలాబాద్‌లో JOBS.. అప్లై NOW

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా అర్హులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 12, 2025

ADB: పాఠశాల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్, రూరల్, మావల, ఇచ్చోడ మండలాల్లోని పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు సహా తరగతి గదుల మరమ్మత్తులపై చర్చించి, పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.

News November 11, 2025

సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.