News August 17, 2024

కమలతో డిబేట్‌: తులసి సాయం కోరిన ట్రంప్

image

డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో చర్చకు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సై అంటున్నారు. ఆమెపై విమర్శల జడివాన కురిపించేందుకు హిందూ అమెరికన్, మాజీ డెమోక్రటిక్ కాంగ్రెస్‌వుమన్ తులసీ గబ్బర్డ్ సాయం తీసుకుంటున్నారు. 2020లో డెమోక్రటిక్ పార్టీకి దూరమయ్యాక ట్రంప్ మద్దతు దారుల్లో ఆమె సెలబ్రిటీగా మారారు. 2019 ప్రైమరీ డిబేట్‌లో ఆమె కమలకు చుక్కలు చూపించారు. తన వాక్చాతుర్యంతో మెప్పించారు.

Similar News

News February 6, 2026

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)

News February 6, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

News February 6, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.